E-PAPER

కూటమికి షాక్… పేగ పంచాయితీ అల్లిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు!

కూటమి ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమన్న వైఎస్సార్‌సీపీ నాయకులు

చింతూరు,( వై7 న్యూస్ తెలుగు), అక్టోబర్ 30:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, గ్రామీణ ప్రాంతాల పట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగానే పేగ పంచాయితీ పరిధిలోని అల్లిగూడెం గ్రామం ‘కొత్త గుంపు’ లో అధికార కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి అరాచక, వైఫల్య పాలనను నిరసిస్తూ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కూటమి పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. స్థానిక వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల సమక్షంలో జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమం గ్రామంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. పార్టీలో చేరిన వారికి నాయకులు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.వైయస్సార్ పార్టీ లో చేరిన పర్సిక బాలకృష్ణ,
ఈ సందర్భంగాకణితి చిట్టిబాబు, కణితి నగేష్, పర్సిక బ్రహ్మయ్యలు , కోర్స భద్రయ్య,లు తో పాటు మొత్తం 40 కుటుంబాలు పార్టీలో చేరినట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి సాధ్యమని నమ్మి, ఆయన ఆశయాలకు ఆకర్షితులమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎస్టీ కమిషన్ మెంబర్ చిచ్చడి మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పునాదులు కదులుతున్నాయి,
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూటమి నేతలు ప్రతిపక్షాల నామినేషన్లను అడ్డుకుంటూ అరాచకాలు సృష్టిస్తున్నారని, ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని” వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. అల్లిగూడెం కొత్త గుంపులో జరిగిన ఈ చేరికలు రాబోయే రోజుల్లో కూటమి పతనానికి నాంది అని, వైఎస్సార్‌సీపీ జనాదరణను ఎవరూ అడ్డుకోలేరని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. ఈ చేరికతో పేగ పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేగ ఎంపీటీసీ అభ్యర్థి తొండం రమాదేవి మరియు జడ్పీటీసీ అభ్యర్థి సవలం అమల ను పరిచయం చేసి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వై రామలింగారెడ్డి, మాజీ సొసైటీ చైర్మెన్ శ్యామల విజయ రెడ్డి, వైస్ ఎంపీపీ మేడిపల్లి సుధాకర్, ఎడమ అర్జున్, మాజీ సర్పంచ్ పాయం చంద్రయ్య, సవలం సత్తిబాబు, ఉప సర్పంచ్ బి బాబురావు, నాయకులు పిసం పోదయ్య, సోడే సీతయ్య, సోడే లక్ష్మయ్య, బజారు,తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!