అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇటీవల ‘లెనిన్’ సినిమాతో కెరీర్లో తొలి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన అఖిల్, అదే జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇకపై గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్‌లో సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టాలెంటెడ్ డైరెక్టర్ పవన్ సాదినేనితో అఖిల్ చేతులు కలపనున్నాడనే వార్తలు టాలీవుడ్లో జోరుగా వినిపిస్తున్నాయి.
‘సేనాపతి’, ‘దయా’ వంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాదినేని ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అఖిల్ అక్కినేనితో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు పవన్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
అఖిల్, పవన్ సాదినేని కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండబోతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుండగా.. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.








