భద్రాచలం , ఆగస్ట్ 08 (వై 7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వంతెన సమీపంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గోదావరి నదిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని స్థానిక గజ ఈతగాడు కరుకు ప్రసాద్ గమనించి ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, భూర్గంపాడు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవారు, మృతికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 53








