హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల సంఘం నూతన కార్యవర్గ నియామక సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గాండ్ల సురేష్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ నాయక్, వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్ చేతుల మీదుగా గాండ్ల సురేష్ నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర స్థాయిలో తనకు బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తానని గాండ్ల సురేష్ పేర్కొన్నారు.
మణుగూరు మండలానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక కావడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్నేహితులు మరియు ఉప సర్పంచుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.








