E-PAPER

‘ది ప్యారడైజ్’ టీజర్ అదిరింది.. ఊర మాస్ అవతార్‌లో నాని

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ టీజర్ విడుదలై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. టీజర్‌లో నాని ఇప్పటివరకు కనిపించని రా అండ్ వైలెంట్ లుక్‌లో దర్శనమిచ్చారు. పవర్‌ఫుల్ విజువల్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.

“ఇక నుంచి ఈ జాగ మనదే.. ఈ దేశమే మనదే..”, “సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా.. మా జనం కోసమా..” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనదైన మాస్ టేకింగ్‌ను చూపించగా, నాని పాత్రను మరింత ఉగ్రంగా, ప్రభావవంతంగా ఆవిష్కరించినట్లు స్పష్టమవుతోంది.

‘దసరా’ తర్వాత మరోసారి నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!