E-PAPER

Realme 16x 5G లాంచ్ డేట్ ఫిక్స్.. 7,000mAh బ్యాటరీతో రాబోతున్న కొత్త ఫోన్!

రియల్‌మీ నుంచి కొత్తగా రాబోతున్న Realme 16x 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ కానుంది. గతేడాది విడుదలైన Realme 15x 5Gకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. “Stay Smooth. Stay Unstoppable” అనే ట్యాగ్‌లైన్‌తో కొత్త ఫోన్‌ను కంపెనీ పరిచయం చేయనుంది.

Realme 16x 5Gలో 7,000mAh భారీ బ్యాటరీని అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఈ బ్యాటరీ సామర్థ్యం కారణంగా ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీ పనితీరుపై దృష్టి పెట్టే వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా Realme 16x 5G కోసం 6 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ ప్రామిస్, 60 నెలల ఫ్లూయెన్సీ గ్యారంటీని కంపెనీ ప్రకటించింది. దీర్ఘకాలం పాటు బ్యాటరీ ఆరోగ్యం, ఫోన్ పనితీరు మెరుగ్గా ఉండేలా హామీ ఇవ్వడం ఈ ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లాంచ్ సందర్భంగా ధర, కెమెరా, ప్రాసెసర్ వంటి ఇతర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!