E-PAPER

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి…

ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కి ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ బృందం వినతి పత్రం

ఏజెన్సీ లో జి.ఓ.నంబర్:68 నీ పకడ్బందీగా అమలు చేయండి

ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ బృందం

రంపచోడవరం,( వై7 న్యూస్) జూలై 30: రంపచోడవరం డివిజన్ ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ బృందం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ డా “సత్య కుమార్ యాదవ్ ను కలిసి ఏజెన్సీ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలను వినతి పత్రం రూపంలో అందించడం జరిగింది.
వినతి పత్రం లో పలు డిమాండ్లను కోరారు

1) కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే 50లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, హెల్త్ కార్డ్స్ మంజూరి చేయాలని

2) ప్రాథమిక ఆరోగ్య కేంద్రలలో పనిచేస్తున్న సిబ్బందికి 5 నెలల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని

3) ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగే ప్రమోషన్స్ అన్ని కూడా జి.ఓ.నంబర్:68 అనుగుణంగానే జరగాలని ఈ నెలలో ఏ యన్ యం ప్రమోషన్ లో ఏజెన్సీ ప్రాంతం ఉద్యోగులకు అన్యాయం జరిగింది అని వివరించడం, ప్లెయిన్ ఏరియా(మైదాన ప్రాంతం) నుండి వచ్చిన ఏ యన్ యం లను వెనక్కి పంపించాలని కోరడం

4) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలలో నాలుగవ స్టాఫ్ నర్సు లను నియమించాలని

4) ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెక్యూరిటీ గార్డ్ లని నియమించాలని

6) కొత్తగా ఏర్పడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూనవరం లో సిబ్బందిని నియమించాలని ఇంకా కొన్ని రకాల డిమాండ్స్ తో వినతి పత్రం మంత్రిగారికి అందించడం జరిగింది అని
మంత్రిగారు సానుకూలంగా స్పందించారని తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ఆదివాసీ
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు,రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు టి శివ సత్యనారాయణ, డివిజన్ ప్రధాన కార్యదర్శి వి.చిన్న రెడ్డి,యన్.సత్యవతి, అప్పలరాజు ఏ యన్ యం, అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News