అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వర్గాల పేరుతో ఓ వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్ర బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై అమెరికా భద్రతా వర్గాలు అప్రమత్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీడియోలో మెలానియా ట్రంప్ న్యూయార్క్‌లో ప్రయాణించే మార్గాలు, ఆమె తరచూ వెళ్లే ప్రదేశాల దృశ్యాలను చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించేలా హింసను ప్రోత్సహించే సందేశాలు ఇందులో ఉన్నాయని విదేశీ మీడియా వెల్లడించింది.
ఈ తరహా బెదిరింపు కంటెంట్ సోషల్ మీడియాలో వెలుగులోకి రావడం మరోసారి ప్రముఖుల భద్రతపై ఆందోళనలను పెంచింది. అయితే వీడియోలో చేసిన ఆరోపణలు లేదా బెదిరింపులపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా వీడియోలోని హింసాత్మక వివరాలను అధికారులు ధృవీకరించలేదు.








