E-PAPER

8000mAh బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17.. ఆగస్టు 6న భారత్‌లో గ్రాండ్ లాంచ్!

షియోమీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 17ను భారత మార్కెట్‌లో ఆగస్టు 6 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో టీజర్లతో ఆసక్తి పెంచిన ఈ ఫోన్, భారీ 8000mAh బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. అలాగే 50 మెగాపిక్సెల్ AI కెమెరా, IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, హైపర్‌ఓఎస్ 3 వంటి ఆధునిక ఫీచర్లతో ఈ డివైస్ రానుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ OLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.1, NFC, USB టైప్-సి పోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ, మల్టీమీడియా ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

ధర విషయానికి వస్తే, అధికారిక ప్రకటనకు ముందే వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,000, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.33,000 ఉండే అవకాశం ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ప్రీమియం కలర్ ఆప్షన్లతో రెడ్‌మీ నోట్ 17 మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News