E-PAPER

రైతుల నుంచి 8 కిలోల తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి ఆరోపణ

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (వై7 న్యూస్):

రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో ధాన్యం కోత విధించి సుమారు రూ.71 లక్షల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కట్టా సతీష్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి అన్యాయంగా క్వింటాకు 8 కిలోల తరుగు విధించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. ఈ విధానంతో రైతుల కష్టార్జిత పంటకు తగిన ధర అందకుండా పోయిందని, కోట్ల రూపాయల వ్యాపారంలో లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. సహకార సంఘాల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టడంతో పాటు రైతుల హక్కులను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ధర్నా కార్యక్రమంలో టీఆర్‌ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజీ నరసింహారావు, టీఆర్‌ఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూరగంటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జి. నరసింహారావు, జి. బీరప్ప, యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రాజ్‌కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు విక్రమ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న, స్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పృథ్వి నాయక్, స్టూడెంట్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!