E-PAPER

వర్షాకాలంలో గజ్జి, తామరకు త్రిఫల చూర్ణం.. సహజ చికిత్సగా ఎలా ఉపయోగించాలి?

ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం ఉన్న త్రిఫల చూర్ణం ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారవుతుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, గజ్జి, తామర వంటి ఫంగల్ చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులోని యాంటీ-ఫంగల్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మక్రిములను అరికట్టడంలో సహాయపడతాయి.

త్రిఫల చూర్ణాన్ని బాహ్య పూతగా ఉపయోగించాలంటే ఒక టీస్పూన్ పొడిలో కొద్దిగా వేప నూనె లేదా కొబ్బరి నూనె కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అలాగే రెండు స్పూన్ల త్రిఫల చూర్ణాన్ని ఒక లీటర్ నీటిలో మరిగించి, చల్లారిన తర్వాత వడకట్టి ఆ నీటితో ఇన్ఫెక్షన్ ఉన్న ప్రాంతాన్ని రోజుకు రెండుసార్లు శుభ్రం చేస్తే దురద, మంట వంటి లక్షణాలు తగ్గే అవకాశం ఉంది.

అయితే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు అనేక కారణాలు ఉండవచ్చు. త్రిఫల చూర్ణం వంటి ఆయుర్వేద చిట్కాలు కొంతమందికి ఉపశమనం ఇవ్వొచ్చుగానీ, తీవ్రమైన ఇన్ఫెక్షన్, పుళ్లు, విస్తృతంగా వ్యాపించే దద్దుర్లు లేదా సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే స్వీయ చికిత్సపై ఆధారపడకుండా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News