వివో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తన S సిరీస్ స్మార్ట్ఫోన్లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం, కొత్త Vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశముందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడం కూడా ఈ ఫోన్ లాంచ్ సమీపంలోనే ఉందనే సంకేతాలను ఇస్తోంది. లీకుల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.50 వేల లోపు ఉండే అవకాశం ఉంది.
ఇది 2019లో రూ.17,990 ధరతో విడుదలైన Vivo S1తో పోలిస్తే భారీ పెరుగుదలగా భావిస్తున్నారు. అప్పట్లో AMOLED డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో Vivo S1 వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు Vivo S2 కూడా ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి రానుందని అంచనా వేస్తున్నారు.








