E-PAPER

మణుగూరులో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. మోడిఫికేషన్ బైకులపై ఉక్కుపాదం


మణుగూరు ,జూలై 23 (వై 7 న్యూస్);
మణుగూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మోడిఫికేషన్ చేసిన వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కొంతమంది ద్విచక్ర వాహనదారులు బులెట్‌తో పాటు ఇతర వాహనాలకు కూడా అనధికారిక మార్పులు చేసి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చడం వల్ల ప్రజలు శబ్ద కాలుష్యానికి గురవుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు సీఐ నాగబాబు పేర్కొన్నారు.

అలాగే వాహనాలకు సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను కూడా పరిశీలిస్తున్నామని, సరైన పత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వాహనాల్లో అనుమతి లేని మోడిఫికేషన్లు చేయకుండా సహకరించాలని పోలీసులు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News