E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన గ్రామపంచాయతీ ప్రతినిధులు

దుమ్ముగూడెం, జూలై 22 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మొలకపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి (గవర్నమెంట్ హాస్పిటల్) ఆవరణలో జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టారు.

ఆసుపత్రి పరిసరాల్లో పెరిగిన పొదలు, కలుపు మొక్కలను తొలగించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం కల్పించడం, దోమలు మరియు విషపురుగుల బెడదను నివారించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మొలకపాడు గ్రామ సర్పంచ్ పర్సిక తులసమ్మ, ఉపసర్పంచ్ తెల్లం సావిత్రి, వార్డు సభ్యులు పొడియం పుష్ప, సొంది గోపాలకృష్ణ, కారం వెంకటలక్ష్మి, గడ్డం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News