E-PAPER

తండ్రిపై మోనాలిసా ఆరోపణలు.. ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయం

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తన తండ్రి తన పాస్‌పోర్ట్, డబ్బు తీసుకున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని ఆరోపిస్తూ ఆమె కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని కోరుతూ న్యాయవాదితో కలిసి ఆదివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు.

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై కిడ్నాప్ ఆరోపణలు ఉన్నాయి. ఆమె మైనర్ అని పేర్కొంటూ మోనాలిసా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను మేజర్‌నని, తన ఇష్టప్రకారమే ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్నానని మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం.

గత నెలలో కూడా తనకు ప్రాణహాని ఉందంటూ మోనాలిసా కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించినప్పటికీ, తర్వాత ఆమెను సంప్రదించలేకపోతున్నామని పోలీసులు తెలియజేయడంతో భద్రతను ఉపసంహరించుకోవాలని కోర్టు పేర్కొంది. తాజాగా మోనాలిసా మళ్లీ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News