E-PAPER

కేసీఆర్ హయాంలో క్రాప్ డ్యామేజ్‌కు పరిహారం లేదు.. రైతులకు అండగా కాంగ్రెస్: భట్టి విక్రమార్క

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో పర్యటించిన ఆయన, రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చింతకాని మండలం జగన్నాధపురం-మత్కేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతు భరోసా కోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్న భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే రూ.35 వేల కోట్లను రైతులకు అందించిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా క్రాప్ డ్యామేజ్ పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

రైతు భరోసా పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8,759 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని భట్టి వెల్లడించారు. త్వరలో జరిగే రైతు ఆశీర్వాద సభలో మరో రూ.1,900 కోట్లను తొమ్మిది నుంచి యాభై ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News