E-PAPER

పట్టణంలో పారిశుధ్య పనులను పరిశీలించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు

శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్ జూన్ 29

పలాస-కాశీబుగ్గ పట్టణంలోని పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచే దిశగా చేపడుతున్న పనులను ఏపీటీపీసీ చైర్మన్ & టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థానిక శాసనసభ్యురాలు గౌతు శిరీష ఆదేశాల మేరకు, పట్టణంలోని సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహం వద్దకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న కల్వర్టులో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని, పూడికను పూర్తిగా తొలగించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా వజ్జ బాబురావు మాట్లాడుతూ, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలు, కల్వర్టులు పరిశుభ్రంగా ఉండటం అత్యంత అవసరమని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారి మార్గదర్శకత్వంలో అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీను, పెంట ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News