E-PAPER

వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి

నందిగాం మండలం లట్టిగాం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు లట్టిగాంకు చెందిన కే. ప్రసాద్ రావు (41) జాతీయ రహదారిపై నిలబడి ఉండగా టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ రావును కుటుంబ సభ్యులు వెంటనే టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News