E-PAPER

టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా వజ్జ బాబూరావు నియామకం

పలాస:
పలాసకు చెందిన వజ్జ బాబూరావు టిడిపి రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ నియామకంపై ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వజ్జ బాబూరావు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పిరుకట్ల విఠల్, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు తదితరులు వజ్జ బాబూరావు గారిని అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News