వై 7 న్యూస్ పలాస
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ నాయకత్వంలో ఏప్రిల్ 22, 2026న విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఓబీసీ మోర్చా కార్యక్రమానికి సంబంధించి శాలివాహన చక్రవర్తి–కవయిత్రి మొల్లమాంబ సాంస్కృతిక కార్యక్రమం పోస్టర్‌ను ఈరోజు పలాసలో ఆవిష్కరించారు.
పలాస బీజేపీ పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్కోజు ధర్మారావు ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ద్వారా రాబోయే వేడుకలను ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బూర్జిపేట హరికృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పేరాడ యోగి, ఐటీ కో-కన్వీనర్ వమ్మరవెల్లి శ్రీనివాసరావు, పలాస మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బోండా శ్రీనివాసరావు, తర్లాన అన్నారావు, సకలాభక్తుల శణ్ముఖరావు, బొమ్మాలి దుర్గారావు, సకాలభక్తుల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.









