E-PAPER

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

వై 7 న్యూస్ పలాస

శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని కోరాయి గేటు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, సోంపేట నుంచి పలాస వైపు వెళ్తున్న టూవీలర్ బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న రక్షణ ఇనుప బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న మందస ఎస్సై కే. కృష్ణ ప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News