పినపాక
పినపాక మండలం ఉప్పాక గ్రామపంచాయతీ పరిధిలోని ఉప్పాక గ్రామంలో ఒక పెంపుడు కుక్కకు గ్రామస్థులు భావోద్వేగంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉప సర్పంచ్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కుక్క సంవత్సరాలుగా గ్రామంలోనే నివసిస్తూ, గ్రామస్థులతో ఆప్యాయ బంధాన్ని ఏర్పరచుకుంది. ఇటీవల అది మృతి చెందడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యుడిగా భావించి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రామ్మోహన్ మాట్లాడుతూ, జంతువులపట్ల ప్రేమ, మానవత్వం చూపించడం మన బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామంలో ఈ సంఘటన ప్రత్యేకంగా నిలిచింది.
Post Views: 104









