E-PAPER

లారీ–బొలెరో ఢీకొని ఘోర ప్రమాదం… ఆరుగురు రైతు కూలీలు గాయాలు

మణుగూరు;

పినపాక మండలం దుగ్గినేపల్లి గ్రామ సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మణుగూరు నుంచి రాజుపేటకు రైతు కూలీలను తీసుకెళ్తున్న బొలెరో వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నాయకులు మణుగూరు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అవసరమైతే భద్రాచలం, ఖమ్మం, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు శివ సైదులు, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గౌరీ ప్రసాద్, నాయకులు రామ్ రెడ్డి, దొడ్డపనేని మధు, చప్పిడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News