వై7 న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
లభ్యమైన సమాచారం ప్రకారం, దివ్య విషపూరితమైన గన్నేరు పప్పు దంచుకుని తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దివ్య మృతి చెందారు.చంద్రశేఖర్ దివ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.దివ్య ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Post Views: 26








