E-PAPER

ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డిని అభినందించిన కలెక్టర్

*సోంపల్లి రైతులతో ముచ్చటించిన కలెక్టర్*

*డ్రోన్ల వినియోగంతో రైతులకు మరింత లాభం*

*కౌజు పిట్టలు, కొర్రమీన్లు, బాతులను రైతులు పెంచాలి*

బూర్గంపహాడ్ డిసెంబర్ 17

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి పొలంలో బుధవారం నాడు కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితిస్ వి పాటిల్ పర్యవేక్షణలో డ్రోన్ల సహాయంతో వరి వంగడాలను వెదజల్లడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఎక్కువగా వరి వంగడాలను సాగు చేయడం అంతర పంటలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నట్టు తెలిపారు. అదేవిధంగా డ్రోన్ల వినియోగం చాలా లాబాదాయకంగా ఉంటుందని అన్నారు. రైతులకు ప్రధాన సమస్యగా కూలీల బెడద ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ కావడంతో రైతులకు ఆదాయం తగ్గి ఆశించిన లాభం రాక నష్టపోతున్నట్టు తెలిపారు. రైతులు కౌజు పిట్టలు, బాతులు, చాపల పెంపకం కొర్రమీనులు వంటి ఆదాయ మార్గాలను ఎంచుకొని కొత్త తరహాలో వ్యవసాయం సాగు చేయుట ద్వారా మేలైన ఉత్పత్తులు సాధించవచ్చు అన్నారు. పలు రకాల కూరగాయల వైపు మొగ్గు చూపాలని సూచించారు. కొన్ని రకాల పంటలకు కోతుల బెడద ఉన్నందున రైతులు వాక్కాయ చెట్లను పెంచడంతో కోతులు బెడద నుంచి ఉపశమనం కలుగుతుందని అన్నారు. సోంపల్లి గ్రామ ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి పొలంలో కృషి విజ్ఞాన కేంద్రం నూతన సాగు విధానాన్ని ఎంపిక చేయడం శుభపరిణామముగా భావిస్తూ గాదె నర్సిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులతో, వ్యవసాయ అధికారులతో ముచ్చటించి అధిక దిగుబడులు సాధించుటకు పలు సూచనలు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!