అశ్వాపురం
అశ్వాపురం మండలం అమ్మగారి పల్లిలో నాలుగు దశాబ్దాలుగా సిపిఎం అప్రతిహత ఆధిపత్యంగా కొనసాగుతున్న సర్పంచ్ పదవికి ఈసారి చరిత్ర మార్చిన ఫలితాలు వెలువడ్డాయి. గత 40 సంవత్సరాలుగా ఎవరూ చెరుగలేని సిపిఎం కంచుకోటను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది.
కాంగ్రెస్ మహిళా అభ్యర్థి ఇరుప కవిత 156 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామంలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన ఈ ఫలితం స్థానికంగా విశేష చర్చనీయాంశం అయింది.
అమ్మగారి పల్లిలో ఎన్నాళ్లనుంచో సిపిఎం బలమైన స్థావరం ఉండగా, ఈసారి కాంగ్రెస్ విజయంతో గ్రామంలో కొత్త రాజకీయ సమీకరణాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Post Views: 445









