పినపాక, డిసెంబర్ 11 – Y7 న్యూస్ తెలుగు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు తన ఓటు హక్కును వినియోగించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే సాధారణ ప్రజలతో కలిసి ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు ఎంతో విలువైనదని సందేశం ఇచ్చారు.
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలని సూచించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు గ్రామాభివృద్ధి దిశగా కీలకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
— Y7 News Telugu
Post Views: 81









