E-PAPER

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – మణుగూరు తహసీల్దార్ నరేష్ హెచ్చరిక

మణుగూరు, డిసెంబర్ 11 ;

ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తామని మణుగూరు తహసీల్దార్ నరేష్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల తొలి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డ్ సభ్యులు మరియు వారి అనుచరులు ఏ రూపంలోనైనా ఊరేగింపులు, విజయోత్సవాలు, డీజేలు, బాణాసంచా వంటి వేడుకలు నిర్వహించరాదని హెచ్చరిక జారీ చేశారు.

ఈ నెల 17 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో, ఎవరైనా నియమాలను అతిక్రమించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ప్రజలు, అభ్యర్థులు ఎన్నికల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని అధికారులు సూచించారు.

Y7 News Telugu

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News