E-PAPER

శేరిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా భాగ్యలక్ష్మి రమేష్ యాదవ్ నామినేషన్ దాఖలు

మెదక్ జిల్లా డిసెంబర్ 01

మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి భాగ్యలక్ష్మి రమేష్ యాదవ్ సోమవారం తన తరపున వార్డు సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి సమర్పించారు.ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి రమేష్ యాదవ్ మాట్లాడుతూ గతంలో ఒకసారి సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయానని అట్టి సమయంలో ప్రతిపక్షంలో ఉండి గ్రామాభివృద్ధికి జరిగిన అవాంతరాలను బయటపెట్టి సంక్షేమానికి తోడ్పడ్డామని ఆ తర్వాత వార్డు సభ్యురాలుగా గెలుపొంది ఉపసర్పంచ్ గా సేవలందించానని రాజకీయంగా అపార అనుభవం ఉన్న తమ కుటుంబం నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నందున అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.గ్రామ అభివృద్ధికి శాయాశక్తుల కృషి చేస్తానని తెలిపారు.శేరిపల్లి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.తమ అమూల్యమైన ఓటును గ్రామ ఓటరు ప్రజలు స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News