Y7 న్యూస్, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఫారెస్ట్ శాఖ పనితీరుపై మళ్లీ ప్రశ్నార్థకాలు రేగుతున్నాయి. తాజాగా మణుగూరు రేంజ్ అధికారులు మరో విచిత్ర పద్ధతికి తెరలేపారు.
ఇప్పటికే ఇసుక ర్యాంపుల కోసం అటవీ మార్గాల్లో అనుమతి లేకుండా రోడ్లు వేయించారని ప్రజలు ఆరోపణలు చేస్తుండగా… ఇప్పుడు బొగ్గు లారీలే వారి కొత్త టార్గెట్ అయ్యాయి.
“ఫారెస్ట్ పర్మిట్ ఫీజు” పేరుతో వసూళ్ల దండ
గురువారం మణుగూరు జీఎం కార్యాలయం వద్దకు వచ్చిన ప్రతి కోల్ లారీ డ్రైవర్‌కి“పర్మిట్ ఫీజు కట్టాలి” అంటూ ఒక్కొక్క లారీపై ₹200 చొప్పున వసూలు చేసినట్టు లారీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు వెంటనే మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అక్కడికి చేరుకున్న సీఐ నాగబాబు ఫారెస్ట్ సిబ్బందిని వివరణ కోరారు.
అతనే చెప్పాడు. .
వసూలుకు కారణం ఏమిటని అడిగితే, ఫారెస్ట్ సిబ్బంది“ఎఫ్.డి.ఓ చెప్పాడు… అతని ఆదేశాలే” అంటూ తమ దౌర్జన్యానికి సమర్థన చెబుతున్నారట.
కానీ సీఐ నాగబాబు స్థానిక ఎఫ్.డి.ఓ సయ్యద్ మక్సుద్‌ను ఫోన్ చేయగా…
నేను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు… డబ్బులు వసూలు చేయమని నేను చెప్పలేదు అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమాధానం విన్న ఫారెస్ట్ సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై… అక్కడే నిలబెట్టిన లారీలన్నింటినీ వదిలేసి ఆచూకీ లేకుండా వెళ్లిపోయారు.
ప్రజల్లో ఆగ్రహం, అధికారులు మౌనం
ఇసుక ర్యాంపుల విషయంలోనే పెద్ద ఎత్తున లంచాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారెస్ట్ విభాగంపై ఇప్పుడు కోల్ లారీ “వసూళ్ల ముఠా” వ్యవహారం మరింత సంచలనం రేపుతోంది.
మణుగూరు మండల ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతూ..
“ఇద్దరు అధికారులు చెప్పారన్న మాటతో డబ్బుల వేటా? ఎవరు నియంత్రిస్తారు?”అంటూ ప్రశ్నిస్తున్నారు.తక్షణమే ఉన్నతాధికారులు ఫారెస్ట్ విభాగంపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.









