భద్రాద్రి కొత్తగూడెం: గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో జిల్లాకు సాధారణ పరిశీలకుడిగా సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకురాలిగా లావణ్య నియమితులయ్యారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ ఇద్దరు పరిశీలకులను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారు వారికి పూల మొక్కను అందించి సన్మానించారు. అనంతరం రాబోయే ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లు, వ్యయ పర్యవేక్షణ, అమలు చేయవలసిన ఎన్నికల నియమావళి వంటి పలు కీలక అంశాలపై అధికారులు పరస్పరం చర్చించారు.
Post Views: 51









