భద్రాద్రి కొత్తగూడెం
రిపోర్టర్ మేకల జ్యోతి| Y7News
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవ్వనున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు యూనివర్సిటీ ప్రాంగణాన్ని పరిశీలించారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ఆయనతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలం, భద్రతా ఏర్పాట్లు, రాకపోకల సౌకర్యాలపై అధికారులు సమగ్ర నివేదిక ఇచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 67









