కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా
రోడ్లపై దాన్యం ఆరబోయడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నదని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఏల్కారం గ్రామం టోల్ గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్ తో కలిసి పరిశీలించారు. రోడ్లపై దాన్యం ఆరబోయడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్లపై దాన్యం ఆరబోయడం మంచి పద్ధతి కాదు అని రైతులకు అవగాహన కల్పించారు. ధాన్యం ఆరబోయడంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని రోడ్లపై అరబోయవద్దని విజ్ఞప్తి చేశారు.
Post Views: 79









