E-PAPER

అటవీ బీట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ

భద్రాద్రి జిల్లా డిఎఫ్ఓ,ఎఫ్ డి ఓ మణుగూరు ని కలిసి వినతి పత్రం అందజేసిన కరకగూడెం ఆదివాసీ జేఏసీ

కరకగూడెం,నవంబర్ 22(Y7 తెలుగు న్యూస్):ఏడుళ్ల బయ్యారం రేంజ్ పరిధిలోని లంబాడి ఫారెస్ట్ అధికారులు గిరిజన ఆదివాసులపై కక్ష్య పూరితంగా ప్రవర్తిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని కరకగూడెం మండల ఆదివాసీ జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ శుక్రవారం మణుగూరులో భద్రాద్రి జిల్లా డి ఎఫ్ ఓ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో గిరిజనేతరులు లంబాడీలు కొత్తగా చెట్లు నరికి చేసుకుంటున్న భూమి జోలికి కానీ, ఫారెస్ట్ ట్రెంచ్ తీసిన భూమిని సాగుచేస్తున్న వారి జోలికి వెళ్లడం లేదు. ఆదివాసులు కోతులు పంటను నాశనం చేస్తున్నాయని ఒక చెట్టు నరికిన దాన్ని ఫోటో తీసుకొని రేంజ్ అధికారి సమక్షం లో కాకుండా ఫారెస్ట్ లంబాడా అధికారులు చెప్పబెట్టకుండా రేంజ్ ఆఫీసుకి తీసుకుపోవడం సరైన పద్దతి కాదన్నారు. అటవీ శాఖ బీట్ అధికారులు గిరిజనేతరులు మరియు లంబాడీలు చేసుకుంటున్న భూములలో ఎటువంటి ఎఫ్ సి సి పాయింట్స్ కనబడవు కానీ, కేవలం ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న ప్రాంతంలోనే ఎఫ్ సి సి పాయింట్స్ ఎలా వస్తాయని మండిపడ్డారు. వాహనాలు వెళ్ళే మార్గం ఉంటేనే అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు కానీ మార్గం లేని భూముల జోలికి వెళ్లడం లేదన్నారు. ఫారెస్ట్ అధికారులు ఎవరైనా కానీ సమన్యాయంగా విధులు నిర్వర్తించాలి కానీ కులవివక్షను దృష్టిలో పెట్టుకొని ఒక్క ఆదివాసీ సమాజం పైనే కక్ష పూరితంగా విధులు కొనసాగిస్తే ఆదివాసీ జేఏసీ చూస్తూ ఊరుకోదు ఖచ్చితంగా ప్రశ్నిస్తుందని హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!