మేళ్లచెరువు:
స్వచ్ఛందంగా రోడ్డుపై నీళ్లు చల్లిన గ్రామ యువకులు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో మెయిన్ రోడ్‌పై భారీగా దుమ్ము ఎగిసిపోతుండడంతో ప్రయాణికులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై గ్రామ యువకులు పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, పట్టించుకోకపోవడంతో యువత ఆగ్రహం వ్యక్తం చేసింది.అధికారుల నిర్లక్ష్యాన్ని చూసి గ్రామ యువకులంతా ఏకమై, స్వచ్ఛందంగా మెయిన్ రోడ్డుపై నీళ్లు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు యువత పేర్కొంది.ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. అందుకే స్వయంగా ముందుకు వచ్చాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది” అని యువత అన్నారు.
Post Views: 34









