మణుగూరు
అఖిలపక్ష పార్టీలు, సంఘాల డిమాండ్.
మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు సమస్యను, లైటింగ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు, సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిలపక్ష పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో మణుగూరు తహసీల్దార్ గారికి ఈ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా భద్రాచలం సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఈ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా పంపించారు.
ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు యొక్క పరిస్థితిని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, సమస్య తీవ్రతను అర్థం చేసుకొని తక్షణమే మణుగూరు నుండి బయ్యారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు మరమత్తులు వెంటనే చేపట్టాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, త్వరలో ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్తామని తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతామని అన్నారు. సమస్యల పట్ల ప్రభుత్వం గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గానీ నిర్లక్ష్యం చేస్తే అఖిలపక్ష పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో కలిసి వచ్చే అందర్నీ కలుపుకొని ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైనా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్.మధుసూదన్ రెడ్డి, బత్తుల.వెంకటేశ్వర్లు, (సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్), దుగ్యాల. సుధాకర్, జక్కుల. రాజబాబు, తోట. రమేష్, జి.వెంకటేశ్వర్లు (సిపిఐ), వై. పూర్ణచందర్ రావు, యార్లగడ్డ. రాజా, మద్దెల. భద్రయ్య, (టిడిపి), లింగంపల్లి. రమేష్, (బిజెపి), రవి (ఎన్ డి), బోయిల్ల. వెంకటేశ్వర్లు, కొండయ్య, చిట్యాల. రజిత (ఎమ్మార్పీఎస్), జె. సూర్యనారాయణ, తురక. మధు (బీసీ సంఘం), వేర్పుల. నరేష్ (మాల మహానాడు) తదితరులు పాల్గొన్నారు.









