అన్ని క్రీడల్లో ప్రావీణ్యత – పాఠశాలకే గర్వకారణం : ప్రిన్స్ పాల్ ఎం.సంధ్యారాణి
తూప్రాన్, వై సెవెన్ న్యూస్ నవంబర్ 18
నర్సాపూర్ మండలంలోని రావెల్లి గ్రామంలో ఉన్న మహాత్మా జ్యోతి రావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీకి చెందిన విద్యార్థులు క్రీడారంగంలో తమ సత్తా చాటి అందరి ప్రశంసలు అందుకున్నారు. డిస్ట్రిక్ట్ సొసైటీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మెరుగైన ప్రదర్శనతో పాఠశాలకు మంచి పేరును తెచ్చారు అని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ పాల్ ఎం. సంధ్యారాణి మాట్లాడుతూ
విద్యార్థులు ప్రతి క్రీడలోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తుండటం పాఠశాల గర్వకారణం. రాష్ట్రస్థాయిలోనూ వారు మెరిసిన తీరు అభినందనీయం అని తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో మెరిసిన విద్యార్థులు అండర్–19 వాలీబాల్ కే. అశ్విని, ఎం. కీర్తన, జి. శివకల్యాణి – రాష్ట్రస్థాయిలో మెరుగైన ప్రదర్శన. అండర్–17 అథ్లెటిక్స్ : వైశాలి… అత్యుత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో మెరిసింది. 800 మీటర్ల పరుగు – 3వ స్థానం. 100 మీటర్ల రన్నింగ్ – 2వ స్థానం. లాంగ్ జంప్ – 2వ స్థానం, 400 మీటర్ల పరుగు 1వ స్థానం డిస్కస్ త్రో – 2వ స్థానం అండర్–14 కబడ్డీ – 2వ స్థానం పాఠశాల సిబ్బంది కృషి అభినందనీయమన్నారూ. విద్యార్థుల ప్రతిభ వెలిగేందుకు పి.డి. అనీల, నిర్మల తో పాటు ఉపాధ్యాయులందరూ చూపిన శ్రమను ప్రిన్సిపాల్ ఎం.సంధ్యారాణి ప్రశంసించారు.
చదువులోనూ, క్రీడల్లోనూ విద్యార్థులు అగ్రస్థానంలో నిలవాలనే మా సంకల్పం. వారికి అవసరమైన అన్ని సదుపాయాలను పాఠశాల అందిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు.









