బూర్గంపహాడ్ ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఇందిరమ్మ రాజ్యంలో నిర్మాణం జరుగుతున్న గృహాలను పరిశీలించే క్రమంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 18వ తేదీన సాని వెంకటరమణ కుటుంబాన్ని వారి ఇంట్లో సందర్శించారు. కుటుంబ సభ్యుల ఆత్మీయ ఆహ్వానం మేరకు వచ్చిన ఎమ్మెల్యే, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాన్ని పరిశీలించి, వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఇందిరమ్మ రాజ్యం పేద కుటుంబాలకు అందిస్తున్న గృహ నిర్మాణ సదుపాయం తమలాంటి కుటుంబాలకు వరంలా మారిందని సాని వెంకటరమణ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో MRO ప్రసాద్, MPDO జమలా రెడ్డి, PR DE వెంకటేశ్వర్లు, PR AE చారి తదితర ప్రభుత్వాధికారులు, మండల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









