పాల్గొన్న ఛైర్పర్సన్ ఉష మరియు కరస్పాండెంట్ రామాంజనేయులు
తూప్రాన్. నవంబర్ 14
తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో ఉన్న అక్షర స్కూల్ లో శుక్రవారం రోజు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గీత మరియు అక్షర స్కూల్ ఛైర్పర్సన్ ఉష మరియు కరస్పాండెంట్ రామాంజనేయులు ఆధ్వర్యంలో మనదేశ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జన్మదినం పురస్కరించుకుని పాఠశాల ప్రిన్సిపాల్ అంబికా, ఇంచార్జ్ శశిధర్ సార్ పర్యవేక్షణలో బాలల దినోత్సవాన్ని అక్షర స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ డే ను నిర్వహించారు. స్పోర్ట్స్ లో గెలుపొందిన విద్యార్థులు ముస్తాఫ్ఫా తరగతి సెకండ్ (ఏ), గైనిబైటి దేవాన్ష్ గౌడ్ తరగతి సెకండ్ (ఏ), అక్షయ్ సాయి తరగతి సెకండ్ (బి) విద్యార్థులకు ఛైర్పర్సన్ ఉష మరియు కరస్పాండెంట్ రామాంజనేయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.









