E-PAPER

స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో దేశంలో అగ్రస్థానం . సింగరేణి సంస్థకు జాతీయ అవార్డు

హైదరాబాద్, నవంబర్ 13 (వై 7 న్యూస్):
స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో దేశవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థగా ఎంపికైన సింగరేణి సంస్థకు జాతీయస్థాయి అవార్డు లభించింది. కొత్త ఢిల్లీలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ వేడుకలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతులమీదుగా సింగరేణి ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ ఈ అవార్డును స్వీకరించారు.

సీఎండీ బలరామ్ మాట్లాడుతూ, “సింగరేణి సంస్థ కేవలం బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలోనే కాదు పరిశుభ్రత, పచ్చదనంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది” అని తెలిపారు.

గత నెల గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ 30 రోజులపాటు కొనసాగింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ 355 ప్రదేశాలలో 7.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రత కార్యక్రమాలు చేపట్టింది.అలాగే 1.70 లక్షల ఫైళ్లను పరిశీలించి, 56,200 నిరుపయోగమైన ఫైళ్లను తొలగించింది.

దేశవ్యాప్తంగా 14 కంపెనీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ అన్ని పరామితుల్లో అగ్రస్థానంలో నిలిచింది. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News