భద్రాద్రి కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సారయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన సంఘం ఎన్నికల్లో సభ్యులు సారయ్యపై విశ్వాసం ఉంచి అధ్యక్ష పదవికి ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ — ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా పాటుపడతానని తెలిపారు.
సభ్యుల ఐక్యతతో సంఘాన్ని మరింత బలపరచి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వృత్తి అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఎన్నికల అనంతరం సభ్యులు పూలమాలలతో సారయ్యను ఘనంగా సన్మానించారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
Post Views: 92









