E-PAPER

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు హెచ్చరిక జారీ చేసిన మణుగూరు ఎస్‌డిపిఒ

మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
గత రెండు రోజుల క్రితం మణుగూరులో పార్టీ కార్యాలయంపై రెండు పార్టీల మధ్య జరిగిన గొడవకు సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు రాజకీయంగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారని మణుగూరు ఎస్‌డిపిఒ హెచ్చరించారు.

పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్‌డిపిఒ మాట్లాడుతూ,

“సున్నితమైన పరిస్థితుల్లో కావాలనే వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారు, పరుష పదజాలంతో విమర్శలు చేసే వారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై నిఘా కొనసాగుతుంది. ఎవరైనా ఈరోజు నుండి ఇలాంటి పోస్టులు పెట్టిన పక్షంలో కేసులు నమోదు చేస్తాం,” అని తెలిపారు.ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News