పలాస కాశీబుగ్గలో ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబురావు
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ నిత్యానంద నగర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్హెచ్ఆర్సి) ప్రాంతీయ కార్యాలయం సోమవారం ప్రారంభమైంది. పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబురావు రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలాస ప్రాంతంలోని ప్రధాన నాయకులు, కార్యకర్తలు, కౌన్సిల్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ చైర్మన్ గారికి, ఇతర ప్రోటోకాల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 66









