E-PAPER

ఘనంగా విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు బియ్యం, పండ్లు, బిస్కెట్లు పంపిణీ

మణుగూరు :
మణుగూరు ఏరియా సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ (VSF) తన 22 సంవత్సరాల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని, 23వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుక్రవారం ఘనంగా వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జరుపుకుంది.

మూడు షిఫ్టులుగా నిర్వహించిన ఈ వేడుకలకు ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కట్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సంతోష్ నగర్‌లోని శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాల వెలుగు) పాఠశాలకు ఒక క్వింటా బియ్యం, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.

విశ్వాస్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఎస్.డి. నా సర్ పాషా విశిష్ట అతిథిగా పాల్గొని, “సెక్యూరిటీ రంగం అభివృద్ధి అవసరం, యువతలో ఉద్యోగ అవకాశాల పెరుగుదల, సేవాస్ఫూర్తి ప్రాముఖ్యత” వంటి అంశాలపై సభ్యులకు అవగాహన కల్పించారు.

పలువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ ఇన్‌స్పెక్టర్ కే. రాజనర్సు, జమేదార్లు బి. శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, పర్మినెంట్ గార్డులు రాజు, వై. కిరణ్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు రామ్ అవతార్, డి. సుధాకర్, షేక్ రబ్బాని, గార్డులు పి. సుధీర్, జె. నరసింహారావు, వి. శ్రీనివాస్, గఫార్, సతీష్ బాబు, నయీమ్ పాషా, రాజేందర్, ఎం.డి. యాకూబ్ పాషా, అల్లా బక్షు, డి.వి. రంగారెడ్డి, ఎం. రాజనర్సు, ఎం. విశ్వేశ్వరరావు, ఎన్. వెంకటేశ్వరరావు, రమేష్ బాబు, సంజీవరెడ్డి, కె. రవి, జె. కోటేశ్వరరావు, రామ్మూర్తి, బి. శ్రీనివాస్, వెంకటస్వామి, కె.ఆర్.కె. రాజు, ప్రవీణ్, రాజేందర్, వి. రవి, పి.వి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులు బి. జగన్మోహన్ రెడ్డి, కిరణ్ సిబ్బంది తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని VSF సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

పులిపాటి పాపారావు | జర్నలిస్ట్

#VishwasSecurityForce #Manuguru #Singareni #PaparaoReports #Y7NewsTelugu

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News