E-PAPER

సారపాక రాజీవ్ నగరంలో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ ; ప్రజల్లో భయభ్రాంతులు

బూర్గంపాడు 30 అక్టోబర్ వై 7 న్యూస్;

సారపాక రాజీవ్ నగరంలో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయి చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బూర్గంపాడు మండలంలోని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించి, స్థానికులతో సమస్యలపై చర్చించారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, ఎన్నిసార్లు విద్యుత్ అధికారులకు తెలియజేసినా పెద్దగా స్పందనలేదని, ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు రావడం, వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు లెగిసిపోవడం వంటివి తరచూ జరుగుతున్నాయని తెలిపారు. నాలుగు రోడ్లు కలిసే జంక్షన్‌లో ఈ పరిస్థితి ఉండడం ప్రజల్లో ఆందోళనకు దారితీస్తోందని పేర్కొన్నారు.

విద్యుత్ అధికారులు వస్తామని చెబుతున్నా, తాత్కాలిక రిపేర్లకే పరిమితమవుతున్నారు. దీర్ఘకాలిక పరిష్కారం చేయకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్‌ను మార్చి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో ఎస్ కె అలి, మంద వెంకటరెడ్డి, యం డి.నజీర్, యం డి రహిమాన్,యం డి అఫ్రీద్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News