కార్మికుల సమస్యల పరిష్కారంపై డిమాండ్
సత్తుపల్లి 30 అక్టోబర్ ,వై 7 న్యూస్;
సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ఏఐటియుసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై.వి. రావు మాట్లాడారు.
వారు మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈపీ ఆపరేటర్ల డి నుంచి సి, సి నుంచి బి గ్రేడ్ ప్రమోషన్లు కల్పించబడినట్లు తెలిపారు. అదేవిధంగా యాజమాన్యంతో చర్చలు జరిపి N– మైనస్ 2 మరియు పెరిక్స్ పై టాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు. త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అలాగే మెడికల్ బోర్డు త్వరగా నిర్వహించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల పిల్లలను విధుల్లోకి తీసుకోవాలని సి & ఎండి కి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. యాజమాన్యం ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.









