ఐఎఫ్‌టియు
మణుగూరు, అక్టోబర్ 29 (వై 7 న్యూస్):
మణుగూరు ఏరియాలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు రక్షణతో కూడిన షెల్టర్స్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్‌టియు నాయకులు కోరారు. ఈ మేరకు ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో ఏరియా ఇన్‌చార్జ్ (ఎస్‌ఓ టు జీఎం) డి.వి. రామారావు కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.డి.నాసర్ పాషా మాట్లాడుతూ ,
“మణుగూరు ఏరియాలో యస్ అండ్ పి సీకి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు అటవీ ప్రాంతాల్లో రక్షణలేని పరిస్థితుల్లో డ్యూటీలు నిర్వర్తిస్తున్నారు. ఈ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి” అని తెలిపారు.
తాజాగా ఓసి–2 అటవీ ప్రాంతంలో రెండో షిఫ్ట్ డ్యూటీ చేస్తూ ఉన్న సెక్యూరిటీ గార్డ్ డి.శ్రీనివాస్ పాముకాటుకు గురైన సంఘటనను ఉదహరించారు.
సమయానికి ఫోన్ సిగ్నల్ ఉండటం, స్పెషల్ టీం దగ్గరలో ఉండటం వలన వెంటనే హాస్పిటల్‌కి తరలించి ప్రాణాపాయం తప్పించగలిగామని చెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు.
అతను మాట్లాడుతూ..
నేషనల్ జియోగ్రఫీలో మాత్రమే చూసే విధమైన విషసర్పాలు ఇప్పుడు మణుగూరు అటవీ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ కారణంగా సెక్యూరిటీ పోస్ట్‌ల వద్ద రక్షణాత్మక షెల్టర్స్, లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పిచ్చి మొక్కలు తొలగించే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కోసం ఖాకీ యూనిఫామ్ అమలు మణుగూరులో ఇప్పటికీ జరగలేదని, తదుపరి టెండర్లో అయినా అమలు చేయాలని కోరారు.
అలాగే సీఎం పీఎఫ్ లెక్కలు 2025 మార్చి వరకు చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగోత్ మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.









