-విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.
-ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండేలా సమీకృత భవన నిర్మాణం
-జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్ వై సెవెన్ న్యూస్, అక్టోబర్ 29:-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని రావెల్లిలో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు.నిర్మాణంలో ఉన్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని పరిశీలించారు.గురుకుల పాఠశాల కళాశాలలో వంటగదిని,వంట సామాగ్రిని వండిన భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థుతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ….గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థినిలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా చూడాలని అధికారులకు సూచించారు.విద్యార్థులు చదువుకొని మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.మున్సిపల్ పరిధిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాన్ని స్థల పరిశీలన చేశారు.ఎంత మేరకు స్థలం అవసర పడుతుందో, ఏ విధంగా భవన నిర్మాణం చేయాలో అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.నిర్మాణలో ఉన్న సమీకృత కార్యాలయాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డిఓ జయచంద్రారెడ్డి తహశీల్దారు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.









