ప్రశ్నిస్తే డ్యూటీ బంద్
మణుగూరు సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల దయనీయ స్థితి
తమ మనోవేదనను Y7NEWS కి ఫోన్ ద్వారా వెల్లడించిన సెక్యూరిటీ గార్డులు
మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ప్రతి రోజు ప్రాణాలను పణంగా పెట్టి డ్యూటీలు చేస్తున్నారు. “డ్యూటీకి వెళ్తే తిరిగి వస్తామా రామా..?” అనే భయం వారి నోట మాటగా మారింది.
84 డీపీ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరి దారుణం, లైటింగ్ లేదు,అడవి మధ్యలో పాముకాట్లు దొంగల భయం ,అడవి జంతువుల బెడదతో ప్రతి నిమిషం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాపలాలు కాస్తున్నారు.“84 డీపీ లో షెల్టర్ లేదు, లైటింగ్ డిమ్ముగా ఉంది” అని ఎన్నిసార్లు తమ సెక్యూరిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. షెల్టర్ వేయమంటే “నామ్ కే వాస్తు”గా చిన్న బ్లాస్టింగ్ షెల్టర్ తీసుకొచ్చి పెట్టారట.అందులో మనిషి కూడా పట్టడు.డ్యూటీకి ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరినే పంపిస్తున్నారు. మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు కు పాము కరిచింది“దేవుడు దయవల్ల ఏమీ జరగలేదు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?” అని గార్డులు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ సమస్య చెప్పుకుంటే పరిష్కారం చూపడం లేదు. ఎగతాళి చేస్తున్నారు.“చేతిలో లాటి ఉందా? తలకు టోపీ ఉందా?” అని అడుగుతారు కానీ షెల్టర్లు ఉన్నాయా, లైటింగ్ సరిగా ఉందా అని మాత్రం ఎవరూ ప్రశ్నించరు.మరింత దారుణమేమిటంటే
ప్రశ్నిస్తే డ్యూటీ నుంచి 10 రోజుల పాటు పక్కన పెట్టేస్తున్నారు.మీడియా వాళ్లకు తమ బాధ చెప్పితే,“మీరు ఎందుకు మీడియాకు సమాచారం ఇస్తున్నారు?” అని బెదిరింపులు, డ్యూటీ లు వేయకుండా ఆదేశాలు జారీ చేస్తున్నారు.సెక్యూరిటీ ఆఫీసర్ ఒక నియంతలా ప్రవర్తిస్తూ గార్డుల్లో భయాందోళన కలిగిస్తూ, భయభ్రాంతులు నింపుతున్నారని వారు వాపోతున్నారు.
“డ్యూటీ చేయకపోతే ఇల్లు గడవదు. కానీ డ్యూటీ చేస్తే ప్రాణం సురక్షితమో కాదో తెలియదు,” అంటూ వారు కన్నీరు పెడుతున్నారు.భార్యా పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రాణభయంతో డ్యూటీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
“మా బాధ ఎవరికి చెప్పుకోవాలి..? మా బాధ ఎవరు తీరుస్తారు..?”అని ఆ గార్డులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.కనీస భద్రతా సదుపాయాలు లేకుండా, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ సెక్యూరిటీ గార్డుల పట్ల ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.









