బూర్గంపహాడ్: నాగినేనిప్రోలు గ్రామపంచాయతీకి చెందిన గోలి బొబ్బిలి పెద్ద కుమారుడు గోలి నాగరాజు ఇటీవల హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
వారి అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన బూర్గంపహాడ్ మాజీ జడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టా విజయ్ గాంధీ నేడు బొబ్బిలి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రేపు జరగబోయే పెద్దకర్మలకు ఆర్థిక సహాయం అందజేసి చేయూతగా నిలిచారు.
ఈ సందర్బంగా స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులు యడమకంటి సుధాకర్ రెడ్డి, హరీష్ యాదవ్, ఆదివాసీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32









